Surya: పది భాషల్లో సూర్య 42వ సినిమా .. మోషన్ పోస్టర్ రిలీజ్!

Surya in Shiva movie

  • సూర్య హీరోగా మరో విభిన్న కథా చిత్రం 
  • కెరియర్ పరంగా ఇది ఆయనకి 42వ సినిమా
  • దర్శకుడిగా శివ చేతికి భారీ ప్రాజెక్టు 
  • కథానాయికగా కనిపించనున్న దిశా పటాని

సూర్య వరుస ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ఆయన 42వ సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయి. యూవీ క్రియేషన్స్ వారు .. స్టూడియో గ్రీన్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సూర్య కెరియర్ లోనే అత్యధిక బడ్జెట్ తో నిర్మితమవుతున్న సినిమాగా ఈ ప్రాజెక్టును గురించి చెబుతున్నారు. సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ ను తీసుకున్నారు


కోలీవుడ్ లో యాక్షన్ తో కూడిన ఎమోషనల్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ గా చెప్పుకునే శివ, ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ గా అక్కడ ఆయనకి మంచి ఇమేజ్ ఉంది. సూర్యతో ఆయన చేయనున్న సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్ ను తాజాగా వదిలారు.

యుద్ధ వీరుడిగా సూర్య ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాడు. ఆయన లుక్ .. కాస్ట్యూమ్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. ఒక భుజంపై అమ్ములపొది .. మరో భుజంపై డేగ .. చేతిలో  గండ్రగొడ్డలి పట్టుకుని ఆయన కనిపిస్తున్నాడు. ఆయన ఎదురుగా యుద్ధవాతావరణం కనిపిస్తోంది. కథానాయికగా దిశా పటాని అలరించనున్న ఈ సినిమాలో, యోగిబాబు ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు.

Surya
Disha patani
Yogibabu
Shiva Movie

More Telugu News