Kamal Haasan: నేటితో 100 రోజులు పూర్తిచేసుకున్న 'విక్రమ్'

Vikram movie update

  • జూన్ 3వ తేదీన విడుదలైన 'విక్రమ్'
  • పాన్ ఇండియా స్థాయిలో పలకరించిన సినిమా
  • కమల్ కి భారీ లాభాలను తెచ్చిపెట్టిన ప్రాజెక్టు ఇది 
  • ఈ రోజుతో 100 రోజులను పూర్తిచేసుకుందంటూ పోస్టర్ రిలీజ్

కమలహాసన్ కథానాయకుడిగా .. ఆయన సొంత బ్యానర్లో 'విక్రమ్' సినిమా రూపొందింది. జూన్ 3వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పహాద్ ఫాజిల్ .. విజయ్ సేతుపతి .. నరేన్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను పలకరించింది. 

'ఖైదీ' .. 'మాస్టర్' సినిమా తరువాత దర్శకుడు లోకేశ్ కనకరాజ్ నుంచి వచ్చిన ఈ సినిమా, తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకుంది. అన్ని ప్రాంతాలలో ఈ సినిమాకి వసూళ్ల వర్షం కురిసింది. హీరోయిన్  .. రొమాన్స్ .. డ్యూయెట్లు  అనేవి లేకుండా కేవలం యాక్షన్  ఫ్లాట్ ఫామ్ పై వెళ్లిన ఈ సినిమా ఈ రోజుతో 100 రోజులను పూర్తి చేసుకుంది. 

చాలా గ్యాప్ తరువాత కమల్ రేంజ్ కి తగిన హిట్ పడింది. ఆయనను ఆర్థికపరమైన సమస్యల నుంచి గట్టెక్కించిన సినిమాగా ఇది నిలిచింది. లోకేశ్ కి ఆయన కోటి రూపాయల కారును బహుమతిగా ఇవ్వడమే కాకుండా, ఇకపై ఆయనకి ఎలాంటి సాయం అవసరమైనా తాను ఉన్నాననే భరోసాను కమల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Kamal Haasan
Fahadh
Vijay Sethupathi
Vikram Movie
  • Loading...

More Telugu News