Chandrababu: చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి డ్రైవర్ నాగరాజుపై దాడి

Attack on Chandrababu personal secretary driver
  • కుప్పంలో నిన్న రాత్రి దాడి
  • బైక్ వెళ్తున్న నాగరాజుపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి
  • కుప్పం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలింపు  
టీడీపీ అధినేత చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ నాయుడు కారు డ్రైవర్ నాగరాజుపై కుప్పంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడం కలకలం రేపింది. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా స్థానిక ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ వద్ద ఆయనపై దాడి చేశారు. నిన్న రాత్రి ఈ దాడి జరిగింది. 

దాడిలో గాయపడిన నాగరాజును స్థానికులు కుప్పం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేశారని నాగరాజు తెలిపాడు. 
Chandrababu
Telugudesam
Kuppam
Persona Secretary
Driver
Attack
YSRCP

More Telugu News