Queen Elizabeth: ఈ నెల 19న లండన్​ లో క్వీన్​ ఎలిజబెత్​ అంత్యక్రియలు

Queen elizabeths funeral to take place on september 19

  • లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబ్బేలో తుది వీడ్కోలు కార్యక్రమం  
  • రెండు నిమిషాల మౌనం.. రాచ కుటుంబ సభ్యులు, అభిమానుల నివాళులు
  • కింగ్ జార్జ్ 4 మెమొరియల్ చాపెల్ లో ఖననంకు ఏర్పాట్లు  

బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్ 2 అంత్యక్రియలను ఈ నెల 19 లండన్ లో నిర్వహించనున్నట్టు బ్రిటన్ అధికార వర్గాలు వెల్లడించాయి. దశాబ్దాలుగా రాణిగా కొనసాగిన ఆమెకు అత్యంత ఘనంగా తుది వీడ్కోలు పలికేందుకు బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబ్బేలో ఎలిజబెత్ అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి అధికారవర్గాలు పలు వివరాలను వెల్లడించాయి.

కింగ్ జార్జ్ 4 మెమొరియల్ లో..
రాణి భౌతిక కాయాన్ని ఉంచిన పేటికను రాచకుటుంబ సభ్యులు వెంటరాగా వెస్ట్ మినిస్టర్ అబ్బేకు తరలించనున్నారు. అక్కడ అంతా రెండు నిమిషాలు మౌనం పాటిస్తారు. తర్వాత పేటికను విండ్సర్ కోటకు తీసుకెళతారు. అందులోని సెయింట్ జార్జ్ చాపెల్ (చర్చ్)కు తరలించి క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియల తంతు పూర్తి చేస్తారు. చివరిగా కింగ్ జార్జ్ 4 మెమొరియల్ చాపెల్ లో ఎలిజబెత్ భర్త ప్రిన్స్ ఫిలిప్ సమాధి పక్కన ఆమె శవ పేటికను ఖననం చేస్తారు.

Queen Elizabeth
UK
Funeral
London
International
  • Loading...

More Telugu News