azad: నేనుగానీ బాలిస్టిక్​ మిస్సైల్​ ప్రయోగిస్తే మాయమైపోయేవారు.. కాంగ్రెస్​ పై గులాం నబీ ఆజాద్​ ఫైర్​

Ghulam nabi azad fires on congress

  • తనపై క్షిపణులు ప్రయోగిస్తే.. రైఫిల్ తో ధ్వంసం చేశానని వ్యాఖ్య
  • రాజీవ్ గాంధీ తనకు సోదరుడి లాంటి వాడని.. ఇందిర తల్లి వంటిదని వ్యాఖ్య
  • అందుకే వారిపై విమర్శలు చేయదలచుకోలేదని వివరణ

కాంగ్రెస్  పార్టీ నుంచి బయటికి వచ్చిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ మరోసారి ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ వారు తనపై క్షిపణులు ప్రయోగించారని.. తాను వాటిని కేవలం పాయింట్ 303 రైఫిల్‌ తో ధ్వంసం చేసి ప్రతీకారం తీర్చుకున్నానని ఆజాద్ వ్యాఖ్యానించారు. అదే తాను ఒకవేళ బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగిస్తే.. కాంగ్రెస్ వాళ్లు మాయమైపోయేవారని పేర్కొన్నారు. 

ఇందిరాగాంధీని తల్లిలా భావించా..
కాంగ్రెస్‌ పార్టీకి తన రక్తం ధారపోస్తే, ఆ పార్టీ తనను విస్మరించిందని కొన్నిరోజుల క్రితం ఆజాద్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచీ తరచూ విమర్శలు గుప్పిస్తున్న ఆజాద్.. తాజాగా జమ్మూకశ్మీర్ లో నిర్వహించిన ఓ సభలో మరోసారి మండిపడ్డారు. అయితే మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీలపై మాత్రం ఆజాద్‌ ప్రశంసలు కురిపించారు. 52 ఏళ్లుగా తాను కాంగ్రెస్ పార్టీలో కొనసాగానని గుర్తు చేశారు. ఆ సమయంలో తాను రాజీవ్‌ గాంధీని సోదరుడిలా, ఇందిరా గాంధీని తల్లిలా భావించానని చెప్పారు. అందుకే వారి గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయదలచుకోలేదన్నారు.

azad
Jammu And Kashmir
Congress
National
India
  • Loading...

More Telugu News