Andhra Pradesh: ఏపీ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ డైరెక్ట‌ర్‌గా వినోద్ కుమార్ నియామ‌కం

vinod kumar appointed as ap dme

  • ఏపీహెచ్ఎస్ఎస్‌పీ పీడీగా కొన‌సాగుతున్న వినోద్ కుమార్‌
  • తాజాగా పూర్తి స్థాయి అద‌న‌పు బాధ్య‌త‌ల‌తో డీఎంఈ పోస్టు
  • ఉత్త‌ర్వులు జారీ చేసిన ప్ర‌భుత్వం

ఏపీ ప్ర‌భుత్వం గురువారం మ‌రో కీల‌క పోస్టులో కొత్త అధికారిని నియ‌మించింది. రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య శాఖ ప‌రిధిలోని డైరెక్ట‌ర్ ఆఫ్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ (డీఎంఈ) పోస్టులో యువ ఐఏఎస్ అధికారి వినోద్ కుమార్‌ను నియ‌మించింది. ప్ర‌స్తుతం ఏపీ హెల్త్ స‌ర్వీసెస్ స్ట్రెంథెనింగ్ ప్రాజెక్ట్ (ఏపీహెచ్ఎస్ఎస్‌పీ) ప్రాజెక్టు డైరెక్ట‌ర్‌గా కొన‌సాగుతున్న వినోద్ కుమార్‌కు తాజాగా పూర్తి స్థాయి అద‌న‌పు బాధ్య‌త‌ల‌తో డీఎంఈ పోస్టును అప్ప‌గించారు. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం శుక్ర‌వారం ఉద‌యం అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేసింది.

Andhra Pradesh
DME
APHSSP PD
Vinod Kumar

More Telugu News