Biggest mouth: అతను నోరు తెరిస్తే.. గిన్నిస్​ బుక్​ రికార్డు వచ్చి పడింది. ప్రపంచంలో అతిపెద్ద నోరున్న యువకుడి వీడియో ఇదిగో

Boy with the biggest mouth in the world

  • అమెరికాలోని మిన్నెసొటాకు చెందిన టీనేజర్ ఐజాక్ జాన్సన్ వరుస రికార్డులు
  • ఒకేసారి నోటిలో నాలుగు మెక్ డొనల్డ్స్ చీజ్ బర్గర్లను పెట్టుకుని ఫొటోలకు పోజులు
  • యూట్యూబ్ లో వీడియో పెట్టిన గిన్నిస్ బుక్ సంస్థ

ఏదైనా తినాలంటే గబుక్కున మింగేసే వాళ్లను అక్కడక్కడా చూస్తుంటాం. పానీ పూరీ బండి దగ్గర అయితే.. ఎంత పెద్ద పానీ పూరీని అయినా ఒకే గుటకలో తినేసేవారూ ఉంటారు. కానీ ఇలాంటి వాళ్లంతా అమెరికాకు చెందిన ఓ యువకుడి ముందు మాత్రం దిగదుడుపే. ఎందుకంటే అతడి నోరు చాలా పెద్దది మరి. ఇటీవలే గిన్నిస్ బుక్ వాళ్లు కూడా ప్రపంచంలో అతి పెద్దగా నోరు తెరవగలిగే వ్యక్తిగా అతడికి రికార్డు కూడా ఇచ్చేశారు. ఆ వివరాలేమిటో చూద్దామా..

నాలుగు అంగుళాలకుపైగా తెరిచి..

అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్రానికి చెందిన టీనేజర్ ఐజాక్‌ జాన్సన్‌. నోటిని అత్యంత పెద్దగా తెరవడంలో మనోడు దిట్ట. 2019లోనే ఏకంగా 3.67 అంగుళాల మేర నోటిని తెరిచి గిన్నిస్‌ రికార్డు సృష్టించాడు. కానీ, అమెరికాకే చెందిన ఫిలిప్‌ ఆంగస్‌ అనే మరో యవకుడు.. ఇతడికన్నా పెద్దగా 3.75 అంగుళాల మేర నోరు తెరిచి రికార్డు బ్రేక్ చేశాడు.

ఇట్లాకాదని మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టిన ఐజాక్.. 2020లో జరిగిన ఓ పోటీలో నోటిని 4 అంగుళాల మేర తెరిచి రికార్డు సృష్టించాడు. తాజాగా తన రికార్డును తానే అధిగమించాడు. ఈసారి తన నోటిని ఏకంగా 4.014 అంగుళాల (10.196 సెంటీమీటర్లు) మేర తెరిచి పురుషుల్లో అత్యధిక వెడల్పుతో నోరు బార్లా తెరిచిన వ్యక్తిగా నిలిచాడు.

ఇక తన నోటి సామర్థ్యం ఏమిటో చూపేందుకు ఒకేసారి 4 మెక్‌డొనాల్డ్స్‌ చీస్‌ బర్గర్లను నోటిలో పెట్టుకుని ఫొటోలుకు పోజిచ్చాడు. అంతేకాదు కోకాకోలా టిన్‌, ప్రింగిల్స్‌ చిప్స్‌ టిన్‌ లనూ నోటిలో పెట్టుకునీ చూపించాడు. ఐజాక్ కు సంబంధించిన వీడియోను గిన్నిస్ బుక్ సంస్థ యూట్యూబ్ లో పెట్టగా.. మూడున్నర లక్షల మందికిపైగా వీక్షించారు కూడా.

Biggest mouth
Biggest mouth boy
USA
Offbeat
Guinness book
Guinness book record
  • Loading...

More Telugu News