Bandi Sanjay: ఈ టీఆర్ఎస్ గొర్రెలు మహిళలను గౌరవించడం లేదు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పాటించడంలేదు: బండి సంజయ్

Bandi Sanjay hits out TRS comments on Governor

  • మూడేళ్లుగా అవమానాలు ఎదుర్కొంటున్నానన్న గవర్నర్ తమిళిసై
  • టీఆర్ఎస్ పై ధ్వజమెత్తిన బండి సంజయ్
  • వీళ్ల నుంచి అంతకంటే ఇంకేం ఆశించగలమని వ్యాఖ్యలు
  • గవర్నర్ పై బీజేపీ ముద్రవేయడం సిగ్గుచేటని విమర్శలు

గత మూడేళ్లుగా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానంటూ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై విచారం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. 

టీఆర్ఎస్ గొర్రెలు మహిళలను గౌరవించడంలేదని, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పాటించడం లేదని విమర్శించారు. కల్వకుంట్ల రాజ్యాంగ ప్రతిపాదకుల నుంచి ఇంతకంటే ఇంకేం ఆశించగలం అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. 

"భారత రాజ్యాంగ సిద్ధాంతాలను అమలు చేయాలని గౌరవనీయ తెలంగాణ గవర్నర్ గారు అడుగుతున్నారు. గవర్నర్ కార్యాలయాన్ని గౌరవించండి. రాజ్ భవన్ వద్ద కల్వకుంట్ల రాజ్యాంగం అమలు చేసినట్టు కాకుండా, ప్రోటోకాల్ కు కట్టుబడి ఉండడం నేర్చుకోండి. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వివక్షను, అస్పృశ్యతను తొలగిస్తుంది, మాట్లాడే హక్కును కల్పిస్తుంది. గవర్నర్ తమిళిసై గారు పార్టీలకు అతీతంగా నిజాలే మాట్లాడారు. కానీ టీఆర్ఎస్ మాత్రం గవర్నర్ పై బీజేపీ ముద్ర వేస్తోంది. తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రథమ పౌరురాలిని అవమానిస్తోంది. ఇది సిగ్గుచేటు" అంటూ బండి సంజయ్ తీవ్రంగా విమర్శించారు.

Bandi Sanjay
BJP
TRS
Governor
Tamilisai Soundararajan
Telangana
  • Loading...

More Telugu News