Telangana: తెలంగాణకు నేడు భారీ వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

Heavy Rains expected in Telangana Today and tomorrow

  • బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి
  • పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ
  • హైదరాబాద్‌లోని కాప్రాలో నిన్న అత్యధిక వర్షపాతం నమోదు

హైదరాబాద్‌లో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండగా నేడు కూడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. మరీ ముఖ్యంగా ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. మిగిలిన జిల్లాల్లోనూ భారీ వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది.  

కర్ణాటక, దక్షిణ తెలంగాణ, ఉత్తర కోస్తా మీదుగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం వరకు ద్రోణి కొనసాగుతుండడమే వర్షాలకు కారణమని వివరించింది. దీని ప్రభావంతో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాగా, నిన్న హైదరాబాద్‌లోని కాప్రాలో గరిష్ఠంగా 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో అత్యల్పంగా 6.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

  • Loading...

More Telugu News