Mamata Banerjee: నేనేమైనా కట్టు బానిసను అనుకుంటున్నారా?: కేంద్రంపై మమతా బెనర్జీ ఆగ్రహం

Mamata Banerjee fires on Center

  • ఢిల్లీ సెంట్రల్ విస్టాలో నేతాజీ విగ్రహం
  • దిగువస్థాయి ఉద్యోగితో ఆహ్వానం పంపారన్న మమత
  • మోదీ ఏడింటికి వస్తారు... మీరు ఆరింటికే రావాలంటూ ఆహ్వానం
  • తాను ఎవరికీ నౌఖరును కాదన్న మమతా

ఢిల్లీ సెంట్రల్ విస్టాలో నేతాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తనను ఆహ్వానించిన తీరు పట్ల పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో స్పందించారు. నేనేమైనా మీ కట్టు బానిసను అనుకుంటున్నారా? అంటూ కేంద్రంపై మండిపడ్డారు. 

సెంట్రల్ విస్టా అవెన్యూలో ప్రధాని నరేంద్ర మోదీ నేతాజీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారంటూ తనకు ఓ దిగువస్థాయి ఉద్యోగితో ఆహ్వానం పంపారని మమతా బెనర్జీ ఆరోపించారు. ప్రధాని మోదీ రాత్రి 7 గంటలకు విగ్రహావిష్కరణ చేస్తారని, మీరు 6 గంటలకే రావాలని ఆ ఉద్యోగి తనను ఉద్దేశించి ఆ ఆహ్వానపత్రంలో పేర్కొన్నాడని వివరించారు. తానేమీ కేంద్రానికి నౌఖరును కాదంటూ స్పష్టం చేశారు. ఇలాంటి కార్యక్రమాలకు ఓ ముఖ్యమంత్రిని ఆహ్వానించేది దిగువస్థాయి ఉద్యోగులా? అంటూ మమతా ప్రశ్నించారు.

Mamata Banerjee
Netaji Statue
Invitation
Narendra Modi
Central Vista
West Bengal
  • Loading...

More Telugu News