Raviteja: సుధీర్ వర్మకి మరో ఛాన్స్ ఇచ్చిన రవితేజ!

Raviteja movies update

  • 'ధమాకా' సినిమాతో రానున్న రవితేజ 
  • షూటింగు దశలో 'రావణాసుర'
  • వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు
  • మరో కథతో రవితేజను మెప్పించిన సుధీర్ వర్మ

రవితేజ ఒక వైపున 'ధమాకా' సినిమాను పూర్తి చేస్తూనే, మరో వైపున 'రావణాసుర' ప్రాజెక్టును కూడా పరిగెత్తిస్తున్నాడు. 'రావణాసుర' సినిమాకి సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ సినిమాకి రవితేజ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమా కొంత వరకూ చిత్రీకరణను జరుపుకుంది. 

'రావణాసుర' సినిమాను స్టైలీష్ యాక్షన్ థ్రిల్లర్ గా సుధీర్ వర్మ రూపొందిస్తున్నాడు. ఆయన కథాకథనాలు తయారు చేసుకునే తీరు .. వాటిని షూట్ చేస్తున్న విధానం .. బడ్జెట్ - సమయం విషయంలో ఉన్న ప్లానింగును చూస్తూ వచ్చిన రవితేజ మనస్ఫూర్తిగా మెచ్చుకున్నాడట. అంతే కాకుండా ఆయనకి మరో ఛాన్స్ ఇచ్చాడని అంటున్నారు. 

ఈ సినిమా షూటింగు గ్యాపులోనే రవితేజకి సుధీర్ వర్మ ఒక కథ చెప్పడం  .. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిందని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ పూర్తయిన తరువాత, మళ్లీ ఇద్దరూ కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నారని అంటున్నారు. 'రావణాసుర' వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News