: కోకకోలా ఆన్ లైన్ స్టోర్
ఇంట్లోనే కూర్చుని కోక్ తాగాలనుకునే వారికోసం కోకకోలా ఆన్ లైన్ స్టోర్ ప్రారంభించింది. ఆన్ లైన్లో ఆర్డరిస్తే ఏకంగా ఇంటికే తెచ్చి ఇస్తారు. 'ఈ కామర్స్' వ్యాపారం రోజురోజుకూ పెరిగిపోతున్నందున ఆన్ లైన్ కస్టమర్ల కోసం హిందూస్తాన్ కోకకోలా coke2home.com సైట్ ను ప్రారంభించింది. ప్రస్తుతానికి దీనిని గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చారు. త్వరలో అన్ని నగరాలు, తర్వాత పట్టణాలకు విస్తరించాలని కంపెనీ యోచన.