Sharwanand: ప్రామిస్ చేసి చెబుతున్నాను .. నన్ను నమ్మండి: శర్వానంద్

Oke Oka Jeevitham movie update

  • శర్వానంద్ హీరోగా 'ఒకే ఒక జీవితం'
  • నిన్నరాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • ఈ సారి  డిజప్పాయింట్  చేయనన్న శర్వా 
  • ఈ నెల 9న విడుదలవుతున్న సినిమా

శర్వానంద్ తాజా చిత్రంగా రూపొందిన 'ఒకే ఒక జీవితం' ఈ నెల 9వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి హైదరాబాదులో జరిగింది. ఈ వేదికపై శర్వానంద్ మాట్లాడుతూ .. "అమలగారు కుదరదంటే .. ఆమె చేయనంటే నేను ఈ సినిమాను ఊహించుకోలేను. అంతగా అమ్మ పాత్రలో ఆమె ఒదిగిపోయారు" అని అన్నాడు. 

సాధారణంగా హీరోయిన్స్ ఎన్ని సీన్స్ ఉన్నాయి .. ఎన్ని సాంగ్స్ ఉన్నాయని అడుగుతుంటారు. అలా కాకుండా రీతూ వర్మ, ఒక మంచి సినిమాలో భాగం కావాలనే ఉద్దేశంతో అంగీకరించినందుకు ఆమెకి నేను థ్యాంక్స్ చెబుతున్నాను. వెన్నెల కిశోర్ కి నేను ఛాన్స్ ఇప్పిస్తే ప్రమోషన్ కి రాకుండా ఎగ్గొట్టాడు .. వాడి సంగతి తరువాత చెబుతాను" అంటూ సరదాగా వార్నింగ్ ఇచ్చాడు. 

''శ్రీకార్తీక్ కథ చెప్పగానే నేను కనెక్ట్ అయ్యాను .. అలాగే సినిమా చూస్తూ మీరూ కనెక్ట్ అవుతారు. ప్రామిస్ చేసి చెబుతున్నాను .. నన్ను నమ్మండి .. ఈ సారి మిమ్మల్ని డిజప్పాయింట్ చేయను. ఈ నెల 9 నుంచి థియేటర్స్ కి వెళ్లి ఈ సినిమాను చూడండి .. మీ అందరికీ నచ్చుతుంది" అంటూ చెప్పుకొచ్చాడు.

Sharwanand
Ritu Varma
Amala Akkineni
Oke Oka Jeevitham Movie
  • Loading...

More Telugu News