Divyavani: ఈటల రాజేందర్ తో భేటీ అయిన సినీ నటి దివ్యవాణి

Actress Divyavani meets Etela Rajender

  • ఇటీవలే టీడీపీకి గుడ్ బై చెప్పిన దివ్యవాణి
  • శామీర్ పేటలోని ఈటల నివాసానికి వెళ్లిన నటి 
  • బీజేపీలో చేరాలని ఈటల ఆహ్వానించినట్టు సమాచారం

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో సత్తా చాటాలని భావిస్తున్న బీజేపీ... ఏపీలో సైతం తన బలాన్ని పెంచుకోవాలనే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలను చేర్చుకోవడమే కాకుండా... సినీ గ్లామర్ ను కూడా వాడుకోవాలనుకుంటోంది. ఇప్పటికే విజయశాంతి, జయప్రద, జీవిత తదితర యాక్టర్లు బీజేపీలో ఉన్నారు. జయసుధ కూడా బీజేపీలో చేరబోతోందనే ప్రచారం జరుగుతోంది. 

ఈ క్రమంలో మరో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇటీవలే టీడీపీకి గుడ్ బై చెప్పిన మరో సినీనటి దివ్యవాణి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను కలిశారు. హైదరాబాద్ శామీర్ పేటలో ఉన్న ఈటల నివాసానికి ఆమె వెళ్లారు. వీరి సమావేశం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. దివ్యవాణిని బీజేపీలోకి ఈటల ఆహ్వానించినట్టు సమాచారం. బీజేపీలో చేరేందుకు ఆమె కూడా సుముఖతను వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

Divyavani
Etela Rajender
BJP
  • Loading...

More Telugu News