Roja: కోడిగుడ్డు మీద ఈకలు పీకే రాజకీయాలు చేస్తున్నారు: రోజా

Roja fires on TDP

  • గోరంట్ల మాధవ్ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకుని నెల నుంచి టీడీపీ రాజకీయం చేస్తోందన్న రోజా 
  • ఇప్పుడు అన్నా క్యాంటీన్ల విషయంలో రాద్ధాంతం చేస్తున్నారని విమర్శ 
  • తప్పుడు ఆరోపణలు చేస్తే చివరకు మీరే ఫూల్స్ అవుతారని వ్యాఖ్య 

ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకుని నెల రోజుల నుంచి టీడీపీ రాజకీయం చేస్తోందని మంత్రి రోజా మండిపడ్డారు. అవసరం లేని విషయాలపై రాద్ధాంతం చేస్తోందని చెప్పారు. తప్పుడు ఆరోపణలు చేస్తే చివరకు మీరే ఫూల్స్ అవుతారని అన్నారు. ఇప్పుడు అన్నా క్యాంటీన్ల విషయంలో కూడా రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. 

ఎన్నికలకు మూడు, నాలుగు నెలల ముందు అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశారని... ఎన్టీఆర్ మీద అంత అభిమానం ఉంటే అధికారంలోకి వచ్చిన వెంటనే క్యాంటీన్లను పెట్టాల్సిందని అన్నారు. ఎన్నికలకు ముందు క్యాంటీన్లను పెట్టి... క్యాంటీన్లను మేము పెట్టాం, మీరు తీసేశారంటూ రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అన్నా క్యాంటీన్ల విషయంలో కోడిగుడ్డు మీద ఈకలు పీకే రాజకీయాన్ని టీడీపీ చేస్తోందని అన్నారు.

Roja
Gorantla Madhav
YSRCP
Telugudesam
Anna Canteens
  • Loading...

More Telugu News