Corona Virus: తగ్గుతున్న కరోనా ఉద్ధృతి.. 50 వేలకు తగ్గిన యాక్టివ్ కేసులు
- గత 24 గంటల్లో 5,379 కేసుల నమోదు
- కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 7,094
- 50,594కి తగ్గిన యాక్టివ్ కేసులు
దేశంలో కరోనా తీవ్రత రోజురోజుకూ తగ్గుతోంది. గత 24 గంటల్లో 3.21 లక్షల మందికి కోవిడ్ టెస్టులను నిర్వహించగా... 5,379 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే, అంతకు ముందు రోజుతో పోలిస్తే ఈ కేసుల సంఖ్య కొంత ఎక్కువ కావడం గమనార్హం. మరోవైపు, ఇదే సమయంలో 7,094 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా 27 మంది మృతి చెందారు. చాలా రోజుల తర్వాత యాక్టివ్ కేసుల సంఖ్య తొలిసారి 50 వేలకు తగ్గాయి. ప్రస్తుతం దేశంలో 50,594 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ప్రస్తుతం దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 1.67 శాతంగా, క్రియాశీల రేటు 0.11 శాతంగా, రికవరీ రేటు 98.70 శాతంగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 2,13,91,49,934 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న 18,81,319 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.