Gautam Adani: బంగ్లాదేశ్ ప్రధానితో గౌతం అదానీ భేటీ... ఫొటో ఇదిగో

gautam adani meets bangladesh prime minister Sheikh Hasina

  • భార‌త్ ప‌ర్య‌ట‌న‌లో బంగ్లా ప్ర‌ధాని హ‌సీనా
  • సోమ‌వారం హ‌సీనాతో భేటీ అయిన అదానీ
  • బంగ్లాకు విద్యుత్ స‌ర‌ఫ‌రాపై చ‌ర్చ‌లు

భార‌త‌ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన బంగ్లాదేశ్ ప్ర‌ధాన మంత్రి షేక్ హ‌సీనాతో భార‌త పారిశ్రామిక దిగ్గ‌జం, అదానీ గ్రూప్ చైర్మ‌న్ గౌతం అదానీ సోమ‌వారం భేటీ అయ్యారు. భార‌త్ ప‌ర్య‌ట‌న కోసం ఆదివార‌మే షేక్ హ‌సీనా ఢిల్లీ చేరుకోగా... తొలి రోజు ఆమె భార‌త రాష్ట్రప‌తితో భేటీ అయ్యారు. ఆ మ‌రునాడు (సోమ‌వారం) ప‌లువురు ప్ర‌ముఖుల‌తో ఆమె భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగానే గౌతం అదానీ ఆమెతో స‌మావేశ‌మ‌య్యారు.

ఈ సంద‌ర్భంగా బంగ్లాదేశ్ అభివృద్ధి ప‌ట్ల షేక్ హ‌సీనా విస్ప‌ష్ట వైఖ‌రితో ముందుకు సాగుతున్నార‌ని అదానీ అన్నారు. గొడ్డా ప‌వ‌ర్ ప్రాజెక్టు ద్వారా 1,600 మెగావాట్ల విద్యుదుత్ప‌త్తి, బంగ్లాదేశ్‌కు విద్యుత్ స‌ర‌ఫ‌రా లైను ఏర్పాటును ఆ దేశ విజ‌య్ దివ‌స్ అయిన డిసెంబ‌ర్ 16 నాటికి పూర్తి చేయ‌డానికి కృత నిశ్చ‌యంతో ఉన్న‌ట్లు అదానీ ప్ర‌క‌టించారు.

Gautam Adani
Adani Group
Bangladesh
  • Loading...

More Telugu News