Sharwanand: అటు హీరో .. ఇటు హీరోయిన్ .. ఇద్దరికీ హిట్ చాలా అవసరం!

Oke Oka Jeevitam Movie Update

  • టైమ్ ట్రావెల్ నేపథ్యంలో నడిచే 'ఒకే ఒక జీవితం' 
  • శర్వానంద్ జోడీగా రీతూ వర్మ 
  • కీలకమైన పాత్రలో అమల అక్కినేని
  • ఈ నెల 9వ తేదీన విడుదల

శర్వానంద్ కి కొంతకాలంగా హిట్ అనేదే లేదు. ఎప్పటికప్పుడు కొత్త కథలను ఎంచుకుంటూ వెళుతూనే ఉన్నాడు. ఆడియన్స్ తో గ్యాప్ లేకుండా చూసుకుంటూ వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అయినా హిట్ అనేది ఆయనతో దోబూచులాడుతూనే ఉంది. 'మహానుభావుడు' తరువాత ఆయన హిట్ అనే మాటనే వినలేదు.  

ఇప్పటికే ఆయన ఖాతాలో అరడజను ఫ్లాపులు చేరిపోయాయి. ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో ఆయన 'ఒకే ఒక జీవితం' సినిమా చేశాడు. అమ్మ ప్రేమను తిరిగి పొందడం కోసం బాల్యంలోకి టైమ్ ట్రావెల్ చేసే ఒక కుర్రాడి కథ ఇది. ఈ నెల 9వ తేదీన ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళంలోను విడుదల చేస్తున్నారు. 

విభిన్నమైన కథాకథనాలతో రూపొందిన ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో శర్వానంద్ ఉన్నాడు. ఇక ఈ సినిమాలో కథానాయికగా నటించిన రీతూ వర్మ కూడా ఈ సినిమాపై గట్టి ఆశలే పెట్టుకుంది. 'టక్ జగదీశ్' .. 'వరుడు కావలెను' వంటి ఫ్లాపులతో ఉన్న రీతూ వర్మకి కూడా, ఈ సినిమా హిట్ కావడం అత్యవసరమనే చెప్పాలి..

Sharwanand
Ritu Varma
Amala Akkineni
Oke Oka Jeeevitham Movie
  • Loading...

More Telugu News