Sudeeep: డిస్నీ హాట్ స్టార్ కి 'విక్రాంత్ రోణా'

Vikranth Rona Movie Update

  • 'విక్రాంత్ రోణా' గా సుదీప్ 
  • జులైలో థియేటర్లకు వచ్చిన సినిమా
  • అడ్వెంచర్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ  
  • ఈ నెల 16 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్  

కన్నడలో కిచ్చా సుదీప్ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇతర భాషల్లో విలన్ గా కూడా ఆయన బిజీ. ఆయన నుంచి ఇటీవల 'విక్రాంత్ రోణా' వచ్చింది. యాక్షన్ తో కూడిన అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఈ సినిమా ప్రేక్షకులను పలకరించింది. షాలినీ మంజునాథ్ నిర్మించిన ఈ సినిమాకి, అనూప్ భండారి దర్శకత్వం వహించాడు. 

జులై 28వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. అజనీశ్ లోకనాథ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ హాట్ స్టార్ వారు దక్కించుకున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ చేయనున్నట్టు ప్రకటించారు. 

ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను వదిలారు. పోలీస్ ఆఫీసర్ గా సుదీప్ నటించిన ఈ సినిమాలో జాక్విలిన్ .. నీతా అశోక్ .. రవిశంకర్ గౌడ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ఓటీటీ ద్వారా ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను తెచ్చుకుంటుందనేది చూడాలి. 

Sudeeep
Jacqueline
Nitha Ashok
Vikranth Rona Movie

More Telugu News