Pradhan Mantri Schools For Rising India Yojana: సర్కారీ పాఠశాలల అభివృద్ధి కోసం కొత్త పథకాన్ని ప్రకటించిన మోదీ... వివరాలివిగో
- పీఎం- శ్రీ యోజన పథకాన్ని ప్రకటించిన మోదీ
- దీనికింద దేశంలోని 14,500 పాఠశాలలు అభివృద్ధి
- ఇవన్నీ మోడల్ స్కూళ్లుగా మారతాయని ప్రకటన
దేశంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు కొత్త పథకాన్ని ప్రారంభించింది. 'ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎం- శ్రీ) యోజన' పేరిట ఈ పథకాన్ని సోమవారం ప్రకటించింది. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా సోమవారం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు అందుకున్న టీచర్లతో సమావేశమైన అనంతరం మోదీ ఈ పథకాన్ని ప్రకటించారు. ఈ మేరకు ఈ పథకం వివరాలను ఆయన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన ట్వీట్లలో వెల్లడించారు.
దీని ప్రకారం, పీఎం- శ్రీ యోజన పేరిట దేశంలోని 14,500 ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయనున్నారు. ఈ కార్యక్రమంతో ఈ ప్రభుత్వ పాఠశాలలు మోడల్ స్కూళ్లుగా మారతాయని ప్రధాని ప్రకటించారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్న లక్షలాది మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని మోదీ పేర్కొన్నారు.