Saidi Reddy: వైఎస్సార్ విగ్రహాలను తగులబెట్టించింది ఉత్తమ్‌ కుమార్ రెడ్డే: సైదిరెడ్డి

Saidi Reddy fires on Uttam Kumar Reddy

  • సూర్యాపేట కలెక్టరేట్ విషయంలో అవినీతి జరిగిందని ఉత్తమ్ అంటున్నారన్న సైదిరెడ్డి 
  • నిరూపిస్తే కోర్టుకు వెళ్లేందుకు తాను సిద్ధమని వెల్లడి 
  • విజయమ్మ కోదాడకు రాకుండా చెప్పులు వేయించింది ఉత్తమ్ కుమార్ రెడ్డేనని ఆరోపణ 

కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై హుజూర్ నగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి విమర్శలు గుప్పించారు. సూర్యాపేట కలెక్టరేట్ విషయంలో అవినీతి జరిగిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపిస్తున్నారని... ఆ ఆరోపణలను నిరూపిస్తే కోర్టుకు వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. కోదాడ, హుజూర్ నగర్ ప్రాంతాల్లో పేకాట క్లబ్బులను పెట్టించింది ఉత్తమ్ కుమార్ రెడ్డేనని ఆరోపించారు. 

గతంలో వైఎస్ విజయమ్మ కోదాడకు రాకుండా అడ్డుకుని, చెప్పులు వేయించింది ఆయనేనని చెప్పారు. వైఎస్సార్ విగ్రహాలను తగులబెట్టించిన చరిత్ర కూడా ఉత్తమ్ దేనని... ఇప్పుడు ఏమీ తెలియనట్టు వైఎస్ విగ్రహాలకు దండలు వేస్తున్నాడని ఎద్దేవా చేశారు.

Saidi Reddy
TRS
Uttam Kumar Reddy
Congress
YSR
  • Loading...

More Telugu News