BCCI: బీసీసీఐ స్పాన్సర్‌షిప్ దక్కించుకున్న మాస్టర్ కార్డ్
![Mastercard acquires title sponsorship rights for all BCCI international and domestic home matches](https://imgd.ap7am.com/thumbnail/cr-20220905tn6315ce11ad2d2.jpg)
- ఏడాది పాటు కొనసాగనున్న ఒప్పందం
- దేశీయంగా జరిగే అన్ని మ్యాచ్‌లకూ మాస్టర్ కార్డే స్పాన్సరర్
- జూనియర్ జట్టు మ్యాచ్‌లకూ స్పాన్సరర్‌గా మాస్టర్ కార్డు
భారత క్రికెట్ నియంత్రణా సంస్థ (బీసీసీఐ)కి టైటిల్ స్పాన్సరర్‌గా ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ మాస్టర్ కార్డ్ ఎంపికైంది. ఈ విషయాన్ని ఇటు మాస్టర్ కార్డ్‌తో పాటు అటు బీసీసీఐ కూడా సోమవారం అదికారికంగా ప్రకటించాయి. 2022-23 ఏడాదికి బీసీసీఐ తరఫున జరిగే అన్ని దేశీయ, అంతర్జాతీయ మ్యాచ్‌లకు మాస్టర్ కార్డ్ టైటిల్ స్పాన్సరర్‌గా వ్యవహరించనుంది. ఇందుకోసం బీసీసీఐకి మాస్టర్ కార్డ్ ఏ మేర చెల్లించనుందన్న విషయం మాత్రం వెల్లడి కాలేదు.
ఏడాది పాటు కొనసాగనున్న ఈ ఒప్పందంలో బీసీసీఐ తరఫున జరిగే జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్‌లకు మాస్టర్ కార్డ్ టైటిల్ స్పాన్సరర్‌గా వ్యవహరించనుంది. అయితే దేశీయంగా జరిగే మ్యాచ్‌లకు మాత్రమే ఈ ఒప్పందం పరిమితం కానుంది. అయితే పురుషుల జాతీయ జట్టుతో పాటు మహిళల జట్ల మ్యాచ్‌లకు కూడా మాస్టర్ కార్డ్ స్పాన్సరర్‌గా వ్యహరించనుంది. దేశీయంగా జరిగే అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు జాతీయ స్థాయిలో జరిగే ఇరానీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, రంజీ ట్రోఫీలకు కూడా మాస్టర్ కార్డే స్పాన్సరర్‌గా వ్యవహరించనుంది. అంతేకాకుండా దేశీయంగా జరిగే జూనియర్ జట్టు మ్యాచ్‌లకు కూడా మాస్టర్ కార్డు స్పాన్సరర్‌గా వ్యవహరించనుంది.