Tirumala: నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బ్రహ్మానందం, వల్లభనేని వంశీ, గంటా శ్రీనివాసరావు... వీడియో ఇదిగో!

Celebrities visits Tirumala

  • తిరుమలలో ప్రముఖుల సందడి
  • నైవేద్య విరామం సమయంలో స్వామివారి దర్శనం
  • వేద ఆశీర్వాదం అందించిన పండితులు
  • పట్టువస్త్రం, తీర్థప్రసాదాలు అందజేసిన అధికారులు

తిరుమల వేంకటేశ్వరుడ్ని నేడు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రముఖ సినీ హాస్యనటుడు బ్రహ్మానందం, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, అపోలో గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. వీరు ఉదయం పూట నైవేద్య విరామం సమయంలో వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని, తమ మొక్కులు చెల్లించుకున్నారు. 

వీరికి దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించారు. ఆలయ అధికారులు పట్టువస్త్రంతో పాటు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

More Telugu News