Gutta Jwala: భర్త సినిమా షూటింగ్ లో సందడి చేసిన గుత్తా జ్వాల

Gutta Jwala in her husband film shooting sets

  • గుత్తా జ్వాల భర్త విష్ణు విశాల్ తాజా చిత్రం 'ఆర్యన్'
  • పూజా కార్యక్రమానికి హాజరైన గుత్తా జ్వాల
  • సినిమా ఉత్కంఠభరితంగా ఉంటుందన్న దర్శకుడు ప్రవీణ్

భారత మాజీ బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల సినీ నటుడు విష్ణు విశాల్ ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వైవిధ్య భరితమైన కథలను ఎంచుకుంటూ విష్ణు విశాల్ ఇప్పటి వరకు మంచి చిత్రాలను చేశాడు. మంచి నటుడిగా గుర్తింపును తెచ్చుకున్నాడు. తాజాగా 'ఆర్యన్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. క్రైమ్, థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ఆయన పోలీస్ అధికారి పాత్రను పోషిస్తున్నాడు. 

ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, వాణి భోజన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమానికి గుత్తా జ్వాల హాజరై సందడి చేసింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. మరోవైపు చిత్ర దర్శకుడు ప్రవీణ్ మాట్లాడుతూ... ఈ సినిమాలో విష్ణు విశాల్ పవర్ ఫుల్ పోలీసు అధికారి పాత్రను పోషిస్తున్నాడని చెప్పారు. ఊహించని మలుపులతో ఈ సినిమా ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తుందని చెప్పారు.

Gutta Jwala
Husband
Vishnu Vishal
Kollywood
  • Loading...

More Telugu News