Dr BR Ambedkar Konaseema District: రావులపాలెంలో అర్ధరాత్రి ఫైనాన్స్ వ్యాపారిపై కాల్పులు

Two Unidentified people fires on financier in Ravulapalem
  • ఫైనాన్స్ వ్యాపారిపై తొలుత దాడికి దిగిన దుండగులు
  • వారిని ప్రతిఘటించిన వ్యాపారి కుమారుడు
  • కాల్పులు జరపడంతో కేకలు వేసిన బాధితులు
కోనసీమ జిల్లాలోని రావులపాలెంలో అర్ధరాత్రి జరిగిన కాల్పులు కలకలం రేపాయి. ఫైనాన్స్ వ్యాపారి అయిన సత్యనారాయణరెడ్డిపై గుర్తు తెలియని ఇద్దరు దుండగులు గాల్లోకి కాల్పులు జరిపారు. తొలుత వారు ఆయనపై దాడిచేయగా సత్యనారాయణరెడ్డి కుమారుడు ఆదిత్యరెడ్డి వారిని ప్రతిఘటించడంతో నిందితులు గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో సత్యనారాయణ, ఆయన కుమారుడు కేకలు వేయడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. 

పారిపోతున్న సమయంలో ఓ దుండగుడి దగ్గరున్న చేతి సంచి కిందపడింది. దానిని పరిశీలించగా అందులో రెండు నాటుబాంబులు, జామర్ ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Dr BR Ambedkar Konaseema District
Ravulapalem
Firing
Crime News

More Telugu News