TTD: చెన్నై నుంచి తిరుమలకు వచ్చే శ్రీవారి గొడుగుల ఊరేగింపులో భక్తులు కానుకలు ఇవ్వొద్దు... వాటితో మాకు సంబంధంలేదు: టీటీడీ

TTD warns devotees do not give offerings during umbrellas rally

  • ప్రతి ఏటా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
  • గరుడసేవకు చెన్నై నుంచి గొడుగులు
  • ఊరేగింపుగా తిరుమలకు గొడుగులు
  • భక్తులు ఇచ్చే కానుకలు తమకు చేరవన్న టీటీడీ

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే గరుడసేవ కోసం ప్రత్యేకంగా చెన్నై నుంచి గొడుగులు తీసుకురావడం ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తోంది. పలు హిందూ ధార్మిక సంస్థలు ఈ ఊరేగింపులో పాలుపంచుకుంటాయి. అయితే, గరుడసేవ నాడు అలంకరించేందుకు చెన్నై నుంచి తిరుమల చేరుకునే గొడుగుల ఊరేగింపులో భక్తులు ఎలాంటి కానుకలు ఇవ్వొద్దని టీటీడీ స్పష్టం చేసింది. 

భక్తులు ఇచ్చే కానుకలు టీటీడీకి చేరవని, ఆ కానుకలతో తమకు సంబంధంలేదని తెలిపింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 27 నుంచి అక్టోబరు 5వ తేదీ వరకు జరగనున్నాయి.

More Telugu News