Vishnu Vardhan Reddy: పరిశ్రమలను అడ్డుకోవడంలో వైసీపీ, టీడీపీ పోటీపడుతున్నాయి: విష్ణువర్ధన్ రెడ్డి

Vishnu Vardhan Reddy slams YCP and TDP

  • బల్క్ డ్రగ్ పార్క్ వద్దని యనమల లేఖ రాశారన్న విష్ణు
  • చంద్రబాబు వివరణ ఇవ్వాలని డిమాండ్
  • కేంద్రం ప్రాజెక్టులు వద్దని జగన్ లేఖ రాశారని వెల్లడి

ఏపీకి బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటూ టీడీపీ నేత యనమల లేఖ రాయడం దారుణమని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో పరిశ్రమలు రాని వేళ బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటును టీడీపీ వ్యతిరేకించడం ఎంతవరకు సబబు? అని ప్రశ్నించారు. దీనిపై చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. పరిశ్రమలను అడ్డుకునే విషయంలో వైసీపీ, టీడీపీ పోటీపడుతున్నాయని విమర్శించారు. 

కేంద్రం ఇచ్చే ప్రాజెక్టులు మాకొద్దంటూ జగన్ ప్రభుత్వం లేఖలు రాసిందని ఆరోపించారు. రోడ్ల నిర్మాణం కోసం ఎన్డీబీ ప్రాజెక్టులో భాగంగా తన వాటా ఇవ్వడానికి కేంద్రం సిద్ధపడిందని, అయితే తమ వాటా కింద ఇవ్వాల్సిన మొత్తానికి అవసరమైన నిధులు తమ వద్ద లేవంటూ వైసీపీ సర్కారు లేఖ రాసిందని విష్ణు వివరించారు.

Vishnu Vardhan Reddy
TDP
YSRCP
BJP
Andhra Pradesh
  • Loading...

More Telugu News