Chinmayi Sripada: సమంతతో విభేదాలు అంటూ వస్తున్న వార్తలపై చిన్మయి శ్రీపాద స్పందన

Chinmayi Sripada opines on her friendship with Samantha

  • 'ఏ మాయ చేశావే' ద్వారా పరిచయమైన సమంత
  • ఆ చిత్రంలో సమంతకు చిన్మయి డబ్బింగ్
  • అప్పటి నుంచి సమంతకు ఆమే డబ్బింగ్
  • ఇటీవల సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటున్న సమంత

అందాలభామ సమంత 'ఏ మాయ చేశావే' సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం తెలిసిందే. ఈ చిత్రంలో సమంతకు డబ్బింగ్ చెప్పింది ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద. అప్పటినుంచి సమంతకు ఆమే డబ్బింగ్ చెబుతూ వస్తోంది. అంతేకాదు, ఇరువురి మధ్య స్నేహం కూడా బలపడింది. అనేక వివాదాలపై ఇరువురూ స్పందించేవారు. అంతలా వీరిమధ్య చెలిమి ఏర్పడింది. 

అయితే, ఇటీవల సమంత తన చిత్రాలకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటోంది. ఈ నేపథ్యంలో, సమంత, చిన్మయి శ్రీపాద మధ్య విభేదాలు ఏర్పడ్డాయని, ఇద్దరి స్నేహబంధం తెగిపోయిందని కథనాలు వచ్చాయి. వీటిపై చిన్మయి శ్రీపాద స్పందించారు. తామిద్దరం కలుసుకున్న ప్రతిసారీ సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టడం కుదరదని, అలా ఫొటోలు పెట్టనంత మాత్రాన విడిపోయినట్టు కాదని స్పష్టం చేసింది. 

ఇప్పటికీ తాము అనేక విందు కార్యక్రమాలకు హాజరవుతామని, ఒక్కోసారి ఇంట్లోనే కలుసుకుంటామని, తాము కలిసిన విషయాన్ని ప్రతిసారీ చెప్పలేమని చిన్మయి వివరించింది. తనకు తెలుగులో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ఊపందుకోవడానికి సమంతే కారణమని, అయితే, ఇప్పుడు సమంతకు తన వాయిస్ అవసరంలేదని పేర్కొంది. సమంతే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటోందని, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సమంతతో తన ప్రయాణం ముగిసినట్టేనని చిన్మయి వెల్లడించింది.

Chinmayi Sripada
Samantha
Friendship
Dubbing
Tollywood
  • Loading...

More Telugu News