Jairam ramesh: అందుకే మేం వీధుల్లోకి వచ్చి పోరాడుతున్నాం..: కాంగ్రెస్​

Jairam fires on Bjp govt

  • ద్రవ్యోల్బణం, నిరుద్యోగం రెండూ మోదీ ప్రభుత్వానికి సోదరులని విమర్శ
  • తమ సభ ఎన్నికల కోసం కాదని స్పష్టం చేసిన జైరాం రమేశ్
  • ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టడానికేనని వెల్లడి

పెరుగుతున్న ధరలతో సామాన్యులు పడుతున్న కష్టాలను కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని.. అందుకే ప్రధాన ప్రతిపక్షంగా తాము వీధుల్లోకి వచ్చి పోరాడుతున్నామని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి నిరుద్యోగం, ద్రవ్యోల్బణం రెండూ కవల సోదరుల వంటివని విమర్శించింది. ఢిల్లీలో కాంగ్రెస్ సభకు ముందు పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ మీడియాతో మాట్లాడారు. తాము ఎన్నికల కోసం సభను నిర్వహించడం లేదని.. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రజల ముందు పెట్టేందుకే సభ నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఆందోళనలు చేస్తూనే ఉన్నాం..
అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే కాంగ్రెస్‌ సభలు, నిరసనలు చేపడుతోందన్న విమర్శలను జైరాం రమేశ్ తప్పుపట్టారు. తాము ప్రజల కోసం విస్తృతంగా ఆందోళనలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఆగస్టు 5న జైపూర్‌లో భారీ నిరసన చేపట్టామని గుర్తు చేశారు. వివిధ రాష్ట్రాల్లోనూ ఆందోళనలు నిర్వహించామని.. ఈ క్రమంలోనే ‘భారత్‌ జోడో యాత్ర’ చేపట్టనున్నామని తెలిపారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం తరహాలోనే ఈడీ, సీబీఐ కూడా మోదీ ప్రభుత్వానికి రెండు సోదరుల్లాంటివని వ్యాఖ్యానించారు.

Jairam ramesh
Congress
India
Politcial
BJP
  • Loading...

More Telugu News