Gaddar: కొత్త గెటప్ లో బీజేపీ కార్యాలయానికి వచ్చిన గద్దర్... గుర్తుపట్టలేకపోయిన నేతలు

Gaddar met Bandi Sanjay

  • బండి సంజయ్ తో భేటీ
  • నూతన పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని వినతి
  • పార్లమెంటులో లేవనెత్తాలని విజ్ఞాపన
  • గద్దర్ కొత్త లుక్ పై బండి సంజయ్ ఆశ్చర్యం

జన వాగ్గేయకారుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్ హైదరాబాదులో బీజేపీ ప్రధాన కార్యాలయానికి విచ్చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని కలిశారు. ఇరువురి మధ్య కాసేపు చర్చ జరిగింది. ఢిల్లీలోని నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టేలా కృషి చేయాలని బండి సంజయ్ ను గద్దర్ కోరారు. ఈ అంశాన్ని పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తాలని విజ్ఞప్తి చేశారు. 

నూతన పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టే విషయమై ఇటీవల రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. ఈ అంశాన్ని పార్లమెంటులో చర్చకు తీసుకువచ్చేలా తీర్మానం చేశాయి. ఈ క్రమంలోనే గద్దర్ నేడు బీజేపీ ఆఫీసుకు వచ్చి బండి సంజయ్ ని కలిశారు. 

కాగా, రొటీన్ కు భిన్నంగా కొత్త గెటప్ లో వచ్చిన గద్దర్ ను తొలుత బీజేపీ ఆఫీసులో కొందరు గుర్తుపట్టలేకపోయారు. బండి సంజయ్ కూడా గద్దర్ ను చూసి ఆశ్చర్యపోయారు. "కొత్త లుక్ లో కనబడుతున్నవ్" అంటూ పలకరించారు.

Gaddar
Bandi Sanjay
BJP Office
New Parliament Building
Ambedkar

More Telugu News