Chiranjeevi: ఈ ఇద్దరు అమ్మాయిలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా: చిరంజీవి

Chiranjeevi applauds Kavya Manyapu and Poorna Malavath

  • చిరంజీవిని కలిసిన కావ్య మన్యపు, పూర్ణ మాలావత్
  • కావ్య ఓ స్పేస్ సైంటిస్టు
  • పూర్ణ యువ పర్వతారోహకురాలు
  • బాలికల్లో చైతన్యం కోసం 'ప్రాజెక్ట్ శక్తి' ఏర్పాటు

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని యువ ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్ కావ్య మన్యపు, పర్వతారోహకురాలు పూర్ణ మాలావత్ కలిశారు. తన నివాసానికి వచ్చిన వారిని చిరంజీవి మనస్ఫూర్తిగా అభినందించారు. వారి ఘనతల వివరాలను తెలుసుకున్నారు. దీనిపై ఆయన ట్విట్టర్లో స్పందించారు.

"ప్రతి అమ్మాయిలోనూ ఈ ప్రపంచాన్ని మార్చే శక్తి ఉంటుంది. ఆ విషయాన్ని  ఈ ఇద్దరు డైనమిక్ యువతులు డాక్టర్ కావ్య మన్యపు, పూర్ణా మాలావత్ నిరూపించారు. అణగారిన వర్గాల బాలికలను విద్య, చైతన్యం, సాధికారిత దిశగా నడిపించేందుకు వీరిద్దరూ ప్రాజెక్ట్ శక్తి చేపట్టారు. అందుకు వారి ప్రయత్నాలను అభినందిస్తున్నా" అని తెలిపారు. ఈ మేరకు కావ్య, పూర్ణలతో దిగిన ఫొటోలను కూడా చిరంజీవి పంచుకున్నారు.
.

Chiranjeevi
Kavya Manyapu
Poorna Malavath
Project Shakti
  • Loading...

More Telugu News