Puri Jagannadh: 'ఇస్మార్ట్ శంకర్ 2' స్క్రిప్ట్ పై పూరి?

Ismart Sshankar 2 movie

  • 'అంచనాలను అందుకోలేకపోయిన 'లైగర్'
  • 'జన గణ మన'పై పడిన ప్రభావం
  • కొంతకాలం ఆ ప్రాజెక్టును పక్కన పెట్టే ఆలోచన  
  • 'ఇస్మార్ శంకర్' సీక్వెల్ దిశగా సన్నాహాలు

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన 'లైగర్' అంచనాలను అందుకోలేకపోయింది. దాంతో ఆ తరువాత ఆయన చేయనున్న 'జన గణ మన' ప్రాజెక్టును ప్రస్తుతానికి ఆపేసే ఆలోచనలో ఉన్నట్టుగా ఒక టాక్ నడుస్తోంది. 'జన గణ మన' కథకి భారీ బడ్జెట్ అవసరం. అంతమొత్తం ఇప్పుడు ఆ ప్రాజెక్టుపై పెట్టడం మరింత రిస్క్ అవుతుందని పూరి భావించినట్టుగా చెబుతున్నారు. 

అందువలన ఆ ప్రాజెక్టును కొంతకాలం పాటు ఆపేసి, తనకి కాసుల వర్షాన్ని కురిపించిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకి సీక్వెల్ చేయాలనే ఆలోచనతో పూరి రంగంలోకి దిగిపోయాడని అంటున్నారు. ఆల్రెడీ సీక్వెల్ కి సంబంధించిన లైన్ ను సెట్ చేసుకుని స్క్రిప్ట్ వర్క్ ను మొదలు పెట్టినట్టుగా సమాచారం. 

మాస్ ఆడియన్స్ ను 'ఇస్మార్ట్ శంకర్' ఏ స్థాయిలో ఊపేసిందనేది తెలిసిందే. అందువలన మళ్లీ రామ్ ను రంగంలోకి దింపే ప్రయత్నంలో పూరి ఉన్నాడు. విజయ్ దేవరకొండ 'ఖుషి'తో పాటు మరో సినిమాను కూడా చేసిన తరువాత 'జన గణ మన' లైన్లోకి రావొచ్చునని అంటున్నారు. ఇక రామ్ ప్రస్తుతం బోయపాటి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.    

Puri Jagannadh
Vijay Devarakonda
Ismart Shankar 2 Movie
  • Loading...

More Telugu News