Shaarrwanand: ముందుగా ప్రభాస్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలి: శర్వానంద్

Oke Oka Jeevitam Movie Update

  • శర్వా తాజా చిత్రంగా రూపొందిన 'ఒకే ఒక జీవితం'
  • టైమ్ ట్రావెల్ నేపథ్యంలో నడిచే కథ 
  • సంగీతాన్ని అందించిన జేక్స్ బిజోయ్ 
  • ఈ నెల 9వ తేదీన విడుదలవుతున్న సినిమా  

శర్వానంద్ .. రీతూ వర్మ జంటగా 'ఒకే ఒక జీవితం' సినిమా రూపొందింది. ఎస్. ఆర్.ప్రభు నిర్మాణంలో శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 9వ తేదీన తెలుగు .. తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. జేక్స్ బిజోయ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా, కొంతసేపటి క్రితం ప్రెస్ మీట్ ను జరుపుకుంది. 

ఈ ప్రెస్ మీట్ లో దర్శకనిర్మాతలతో పాటు శర్వానంద్ .. రీతూ వర్మ .. అమల అక్కినేని పాల్గొన్నారు. శర్వానంద్ మాట్లాడుతూ .. "ఈ సినిమా ప్రమోషనల్ సాంగ్ చేయడానికి హీరో కార్తి ముందుకు రావడం .. ఆ పాటను పాడటం గొప్ప విశేషం. అలాగే ప్రభాస్ గారికి ట్రైలర్ పంపించగానే వెంటనే పోస్ట్ చేశారు. అలా ట్రైలర్ జనంలోకి వెళ్లడానికి కారణమైన ఆయనకి థ్యాంక్స్ చెబుతున్నాను" అన్నాడు. 

'ఒకే ఒక జీవితం' అనే టైటిల్ చూసి ఇది మదర్ సెంటిమెంట్ సినిమా .. ఎమోషన్స్ భారీగా ఉంటాయని భయపడవలసిన పనిలేదు. నా పాత్రతో పాటు వెన్నెల కిశోర్ .. ప్రియదర్శి పాత్ర వైపు నుంచి కూడా కావలసినంత ఎంటర్టయిన్మెంట్ ఉంటుంది. తప్పకుండా ఈ సినిమా నా కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలబడుతుంది" అని చెప్పుకొచ్చాడు..

Shaarrwanand
Ritu Varma
Oke Oka Jeevitam Movie
  • Loading...

More Telugu News