O Meri Jaan: 'లక్కీ లక్ష్మణ్‘ చిత్రం నుంచి 'ఓ మేరీ జాన్' గీతాన్ని విడుదల చేసిన దర్శకుడు చందు మొండేటి

- సోహైల్, మోక్ష జంటగా లక్కీ లక్ష్మణ్
- ఏఆర్ అభి దర్శకత్వంలో చిత్రం
- అనూప్ రూబెన్స్ సంగీతం
- ఓ మేరీ జాన్ పాటను రాసిన భాస్కరభట్ల
- ఆడియన్స్ నుంచి విశేష స్పందన
చుట్టూ ఉన్న వారంతా నువ్వు లక్కీ ఫెలో అంటున్నా... తాను మాత్రం ఎప్పటికీ అన్ లక్కీ ఫెలోనే అని ఫీలయ్యే ఓ యువకుడి జీవితంలో జరిగిన అనేక ఆసక్తికర పరిణామాలతో రూపొందిన ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘లక్కీ లక్ష్మణ్’.
బిగ్ బాస్ ఫేమ్ సోహైల్, మోక్ష జంటగా ఏఆర్ అభి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. దత్తాత్రేయ మీడియా పతాకంపై హరిత గోగినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలోనే విడుదల చేయడానికి చిత్ర నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.

కాగా, ఈ చిత్రంలో రాజా రవీంద్ర, సమీర్, కాదంబరి కిరణ్, రచ్చ రవి, జబర్దస్త్ కార్తీక్ తదితరులు నటించారు.