Tenali: తెనాలిలోని అన్నా క్యాంటీన్ వద్ద ఉద్రిక్తత

High tension at Tenali Anna Canteen

  • గత నెల 12న మున్సిపల్ మార్కెట్ కాంప్లెక్స్ వద్ద అన్నా క్యాంటీన్ ఏర్పాటు
  • ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయనే కారణంతో క్యాంటీన్ మూసేయాలని నోటీసులు
  • ఆహారాన్ని పంపిణీ చేస్తామన్న టీడీపీ నేతలు

గుంటూరు జిల్లా తెనాలిలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక మున్సిపల్ మార్కెట్ కాంప్లెక్స్ వద్ద గత నెల 12న అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారు. అయితే, క్యాంటీన్ ను మూసివేయాలని రెండు రోజుల క్రితం మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అన్నా క్యాంటీన్ వల్ల ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయని నోటీసుల్లో పేర్కొన్నారు. అయినప్పటికీ ఈరోజు కూడా అన్నా క్యాంటీన్ ను ఓపెన్ చేస్తామని... ఆహారాన్ని పంపిణీ చేస్తామని టీడీపీ నేతలు చెప్పారు. 

ఈ నేపథ్యంలో, టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగే అవకాశం ఉందనే సమాచారంతో క్యాంటీన్ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. చుట్టుపక్కలున్న షాపులను కూడా పోలీసులు మూసివేయించారు. దీంతో, అక్కడ కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. మరోవైపు షాపులను మూసివేయించడంపై వ్యాపారులు, ప్రజలు అసహనం వ్యక్తం చేశారు.

Tenali
Anna Canteen
Telugudesam
  • Loading...

More Telugu News