Mahesh Babu: మహేశ్ కోసం రంగంలోకి మలయాళ నటుడు!

Roshan Mathew in trivikram movie

  • రెగ్యులర్ షూటింగుకి రెడీ అవుతున్న మహేశ్ మూవీ
  • ఆయన సరసన నాయికగా పూజ హెగ్డే 
  • విలన్ పాత్ర కోసం రోషన్ మాథ్యూ ఎంపిక 
  • ఈ నెలలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ప్రాజెక్టు

మహేశ్ బాబు సినిమాతో సెట్స్ పైకి వెళ్లడానికి త్రివిక్రమ్ రెడీ అవుతున్నాడు. ఈ నెలలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రకిగాను కొంతమంది పేర్లను పరిశీలించిన త్రివిక్రమ్, మలయాళ నటుడు రోషన్ మాథ్యూను ఎంపిక చేసినట్టుగా చెబుతున్నారు. 

రోషన్ మాథ్యూ ఎవరో కాదు .. నిన్న విడుదలైన 'కోబ్రా' సినిమాలో మెయిన్ విలన్. మలయాళంలో నటుడిగా ఆయన కెరియర్ 2015లోనే మొదలైంది. చాలా తక్కువ కాలంలోనే విలక్షణ నటుడిగా ఆయన అక్కడ మంచి పేరును తెచ్చుకున్నాడు. 'కోబ్రా'  సినిమాతోనే ఇక్కడి ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. 

నాని 'దసరా' సినిమాలోను  రోషన్ మాథ్యూ ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. అలాంటి ఆయనను మహేశ్ మూవీలో విలన్ పాత్రకి గాను త్రివిక్రమ్ తీసుకున్నాడని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది. ఈ సినిమాలో మహేశ్ సరసన నాయికగా పూజ హెగ్డే అలరించనున్న సంగతి తెలిసిందే.

More Telugu News