G Jagadish Reddy: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయన్న కోమటిరెడ్డి వ్యాఖ్యలపై జగదీశ్ రెడ్డి సెటైర్లు

Jagadish Reddy satires on Komatireddy Raj Gopal Reddy

  • మునుగోడులో బీజేపీ మూడో స్థానంలో ఉందన్న మంత్రి 
  • అందుకే ఉప ఎన్నికకు వెనకడుగు వేస్తోందని వ్యాఖ్య 
  • ముందస్తు ఎన్నికలు వస్తాయని చెపుతుండటం హాస్యాస్పదమన్న జగదీశ్ రెడ్డి 

మునుగోడుకు ఉప ఎన్నిక రాదని... తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి జగదీశ్ రెడ్డి సెటైర్లు వేశారు. మునుగోడు ఉప ఎన్నిక సర్వేల్లో బీజేపీ మూడో స్థానంలో ఉందని పలు సర్వే సంస్థలు వెల్లడిస్తున్నాయని... అందుకే బీజేపీ వెనకడుగు వేస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. 

కాంగ్రెస్ కు రాజీనామా చేసిన తర్వాతే మునుగోడు ఉప ఎన్నిక జరుగుతుందని ఇంతకుముందు కోమటిరెడ్డి చెప్పారని... ఇప్పుడు మరోమాట మాట్లాడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ చెపుతుండటం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. సైనికులు, రైతుల కుటుంబాలను కేసీఆర్ పరామర్శిస్తుంటే విమర్శలు చేస్తుండటం విపక్షాల హ్రస్వ దృష్టికి నిదర్శనమని అన్నారు. జవాన్ల త్యాగాలను కూడా గుర్తించలేని గొప్ప దేశ భక్తులు విపక్ష నేతలని దుయ్యబట్టారు.

G Jagadish Reddy
KCR
TRS
Komatireddy Raj Gopal Reddy
BJP
Munugode
  • Loading...

More Telugu News