Revanth Reddy: తెలంగాణ అమరజవాను కుటుంబాన్ని మర్చిన కేసీఆర్ బీహార్లో అమరజవాన్ల కుటుంబాలకు పరిహారం పంచారు: రేవంత్ రెడ్డి

Revanth Reddy slams KCR

  • బీహార్ లో పర్యటించిన కేసీఆర్
  • అమర జవాన్ల కుటుంబాలకు ఆర్థికసాయం
  • విమర్శనాస్త్రాలు సంధించిన రేవంత్ రెడ్డి
  • తెలంగాణలోని అమరజవాన్ కుటుంబాన్ని విస్మరించారని వెల్లడి

సీఎం కేసీఆర్ బీహార్ వెళ్లి అమరజవాన్ల కుటుంబాలకు ఆర్థికసాయం అందించడం తెలిసిందే. గల్వాన్ లోయలో చైనా బలగాలతో జరిగిన ఘర్షణల్లో వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు నిన్న బీహార్ సీఎం నితీశ్ కుమార్ తో కలిసి చెక్కులు పంపిణీ చేశారు. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. 

  ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొండారెడ్డిపల్లికి చెందిన అమరజవాను యాదయ్య కుటుంబాన్ని కేసీఆర్ మర్చిపోయారని, కానీ బీహార్ వెళ్లి అక్కడి అమరజవాన్ల కుటుంబాలకు మాత్రం పరిహారం పంచి వచ్చారని పేర్కొన్నారు. ఆయనది రాజ్యాధికార విస్తరణ కాంక్షా... లేక అమర జవాన్ల కుటుంబాల పట్ల సానుభూతా...? అనేది సమాజం ఆలోచించాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Revanth Reddy
KCR
Amar Jawan
Bihar
Telangana
Congress
TRS
  • Loading...

More Telugu News