Anantapur District: సొంతూళ్లోని త‌న ఇంటి ఫొటోను పోస్ట్ చేసిన‌ అనంత‌పురం జిల్లా ఎస్పీ ఫ‌కీర‌ప్ప

Anantapur SP posts hin own house in his native village

  • వ‌రుస వివాదాల్లో అనంత‌పురం ఎస్పీ ఫ‌కీర‌ప్ప‌
  • తాజాగా కానిస్టేబుల్ ఫిర్యాదుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు న‌మోదు
  • ఆరోప‌ణ‌ల‌ను ఖండిస్తూ త‌న ఇంటి ఫొటోను పంచుకున్న ఐపీఎస్ అధికారి

ఏపీలోని అనంత‌పురం జిల్లా ఎస్పీగా కొన‌సాగుతున్న ఐపీఎస్ అధికారి ఫ‌కీర‌ప్పపై ఇటీవ‌లి కాలంలో ప‌లు ఆరోప‌ణ‌లు వినిపించిన సంగ‌తి తెలిసిందే. అనంత‌పురం జిల్లా ఎస్పీ పోస్టు కంటే ముందు క‌ర్నూలు జిల్లా ఎస్పీగా కొన‌సాగిన ఆయ‌న‌పై ప‌లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. వ‌రుస ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో తాజాగా త‌న‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు న‌మోదు అవ‌డంతో ఆయన కాస్తంత ఇబ్బంది ప‌డ్డ‌ట్టుగా స‌మాచారం. అది కూడా పోలీసు శాఖ‌కు చెందిన ఓ కానిస్టేబుల్ ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు న‌మోదు కావడం ఫ‌కీర‌ప్ప‌ను క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేసింద‌న్న వాద‌న‌లు వినిపించాయి.

ఈ నేప‌థ్యంలో త‌న‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌కు సమాధానంగా... త‌న వాస్త‌వ ప‌రిస్థితిని క‌ళ్ల‌కు క‌ట్టేలా ఫ‌కీర‌ప్ప బుధ‌వారం సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ ఫొటోను షేర్ చేశారు. క‌ర్ణాట‌క‌లోని హ‌వేరీ జిల్లా నెల‌గోల్ గ్రామం త‌న సొంతూర‌ని, త‌న ఊళ్లో త‌న ఇల్లు ఇదేన‌ని ఆయ‌న ఆ ఫొటోను పోస్ట్ చేశారు. త‌న గురించి ఆరోప‌ణ‌లు చేస్తున్న వారికి త‌న ఇంటి ఫొటోతోనే స‌మాధానం చెబుతూ ఆయ‌న ఈ ఫొటోను షేర్ చేశారు. తనపై అనుమానం ఉన్న వారంతా ఇది తనదేన‌ని తెలుసుకోవాలి అంటూ ఆయ‌న ఆ ఫొటోకు ఓ కామెంట్ జ‌త చేశారు.

Anantapur District
Andhra Pradesh
Dr.Fakkeerappa Kaginelli IPS
Anantapur SP

More Telugu News