Chandu Mondeti: దేవుణ్ణి నమ్ముకున్నవాడు ఎప్పుడూ చెడిపోడు: రాఘవేంద్రరావు

Karthikeya 2 Team Interview

  • క్రితం నెల 13న వచ్చిన 'కార్తికేయ 2'
  • 100 కోట్లకి పైగా రాబడుతున్న వసూళ్లు 
  • ఈ సినిమా టీమ్ ను ఇంటర్వ్యూ చేసిన దర్శకేంద్రుడు 
  • నేడు ఇలాంటి కంటెంట్ అవసరమంటూ అభినందనలు 

టాలీవుడ్ కి రాఘవేంద్రరావు ఎన్నో హిట్లు ఇచ్చారు. 'అన్నమయ్య' .. 'శ్రీరామదాసు' వంటి భక్తి రసాత్మక చిత్రాలతోను ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు. అలాంటి ఆయన 'కార్తికేయ 2' టీమ్ ను ఇంటర్వ్యూ చేయడం విశేషం. నిఖిల్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో .. కాలభైరవ సంగీతంతో రూపొందిన ఈ సినిమా 100 కోట్లకి పైగా వసూళ్లతో దూసుకెళుతోంది. 

ఈ సినిమా టీమ్ తో రాఘవేంద్రరావు మాట్లాడుతూ .. "కలియుగంలో .. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి ఒక సినిమా రావలసిన అవసరం ఉంది. సాధారణంగా ఒక సినిమా గురించి తెలిసినప్పుడు ఆడుతుందో .. లేదో అనుకుంటాము. కానీ 'కార్తికేయ 2' సినిమా గురించి విన్న దగ్గర నుంచి ఈ  సినిమా ఆడుతుందనే అనుకున్నాను" అన్నారు. 

దేవుడిని నమ్ముకున్నవాడు ఎప్పుడూ చెడిపోడు. దేవుణ్ణి నమ్ముకోవడం వల్లనే ఈ సినిమా ఇంతటి విజయాన్ని సాధించింది. దేవుడనేవాడు ఒకడున్నాడు అనే విషయాన్ని ఈ సినిమా మరోసారి నిరూపించింది. అందుకు నేను ఈ సినిమా టీమ్ ను అభినందిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చారు..

More Telugu News