Ramcharan: లోకేశ్ కనగరాజ్ పైనే దృష్టిపెట్టిన చరణ్!

Charan upcoming movies

  • శంకర్ సినిమాతో బిజీగా చరణ్ 
  • నెక్స్ట్ ప్రాజెక్టు లోకేశ్ తో అంటూ టాక్ 
  • విజయ్ తో మరో సినిమా చేస్తున్న లోకేశ్ 
  • ఆ తరువాత చరణ్ ప్రాజెక్టు పట్టాలెక్కే ఛాన్స్

కోలీవుడ్ లో ఇప్పుడు దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఆయనతో సినిమా చేయాలని స్టార్ హీరోలు పోటీ పడుతున్నారు. 'ఖైదీ' .. 'మాస్టర్' .. 'విక్రమ్' సినిమాలు సంచలన విజయాలను నమోదు చేయడంతో ఆయన డిమాండ్ పెరిగిపోయింది. ప్రస్తుతం ఆయన విజయ్ తో మరో సినిమా చేస్తున్నాడు. 

అలాంటి లోకేశ్ తో తన నెక్స్ట్ మూవీ ఉండేలా చరణ్ ప్లాన్ చేస్తున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో చరణ్ ఒక సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా నిర్మాణం సాగుతోంది. ఆ తరువాత సినిమా కూడా అదే స్థాయిలో ఉండాలని చరణ్ ఆలోచన చేసినట్టుగా చెబుతున్నారు. 

ఆ మధ్య ఇక్కడికి వచ్చినప్పుడు తెలుగులో తన ఫస్టు మూవీ చరణ్ తో ఉండొచ్చునని లోకేశ్ చెప్పినమాట తెలిసిందే. చరణ్ తో తనకి మంచి సాన్నిహిత్యం ఉందని కూడా అన్నాడు. దాంతో 'ఖైదీ 2' .. 'విక్రమ్ 2' సినిమాలకంటే ముందు, చరణ్ తో ఉండొచ్చునని అంటున్నారు. మరి చరణ్ తో గౌతమ్ తిన్ననూరి అనుకున్న ప్రాజెక్టు ఏమవుతుందో చూడాలి.

Ramcharan
Shankar
Lokesh kanagaraj
Kollywood
  • Loading...

More Telugu News