Mahesh Babu: పక్కా ప్లానింగుతో రంగంలోకి దిగుతున్న త్రివిక్రమ్!

Trivikram Movie Update

  • మహేశ్ 28వ సినిమాకి సన్నాహాలు 
  • వచ్చేవారం నుంచి షూటింగు మొదలు 
  • యాక్షన్ సీన్ తో మొదలుకానున్న ఫస్టు షెడ్యూల్ 
  • వచ్చే ఏడాది ఏప్రిల్ 28వ తేదీన సినిమా రిలీజ్  

త్రివిక్రమ్ శ్రీనివాస్ తాజా చిత్రం మహేశ్ బాబుతో రూపొందనుంది. కెరియర్ పరంగా మహేశ్ బాబుకి ఇది 28వ సినిమా. వచ్చేవారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని అంటున్నారు. 

ఫస్టు షెడ్యూల్ షూటింగును ఏకధాటిగా నెల రోజుల పాటు జరిగేలా ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు. ఇక సెకండ్ షెడ్యూల్ కూడా వెంటనే మొదలు పెట్టేసి, దానిని కూడా నాన్ స్టాప్ గా లాగించేలా ప్లాన్ చేశారని అంటున్నారు. ముందుగా ఒక భారీ యాక్షన్ సీన్ తో ఫస్టు షెడ్యూల్ ను మొదలెడుతున్నారని సమాచారం. 

ఈ సినిమాలో కథానాయికగా పూజ హెగ్డేను తీసుకున్నారు. ఫస్టు షెడ్యూల్లోనే ఆమె పాల్గొననుందని అంటున్నారు. మహేశ్ తో త్రివిక్రమ్ చేసే మూడో సినిమా ఇది. 'అరవింద సమేత' .. 'అల వైకుంఠపురములో' తరువాత త్రివిక్రమ్ చేస్తున్న ఈ సినిమా, ఆలయానికి హ్యాట్రిక్ హిట్ ఇస్తుందేమో చూడాలి. వచ్చే ఏడాది ఏప్రిల్ 28వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

More Telugu News