Reliance: కంపా కోలా.. పెప్సీ, కోకాకోలాకు పోటీగా రిలయన్స్ కూల్ డ్రింక్స్!

Reliance acquires soft drink brand campa

  • కంపా, సోస్యో బ్రాండ్లను కొనుగోలు చేసిన రిలయన్స్ సంస్థ
  • ఈ ఏడాది దీపావళి నాటికి తమ కూల్ డ్రింక్స్ ను మార్కెట్లోకి తెచ్చే యోచన
  • మరికొద్ది రోజుల్లోనే నిత్యావసర సరుకుల తయారీపైనా రిలయన్స్ దృష్టి

మన దేశంలో కూల్ డ్రింక్స్ మార్కెట్లో లీడర్లుగా ఉన్న కోకాకోలా, పెప్సీలకు పోటీగా రిలయన్స్ కూల్ డ్రింక్స్ మార్కెట్లోకి రానున్నాయి. ఎఫ్ఎంసీజీ రంగంలోకి ప్రవేశిస్తామని ముఖేశ్ అంబానీ ప్రకటించిన రెండు రోజుల్లోనే దీనికి సంబంధించి కీలక అడుగు పడటం గమనార్హం. ఢిల్లీకి చెందిన ప్యూర్ డ్రింక్స్ కంపెనీకి చెందిన కంపా కోలా, సోస్యో సాఫ్ట్ డ్రింక్స్ బ్రాండ్లను రిలయన్స్ తాజాగా కొనుగోలు చేసింది. ఈ కూల్ డ్రింక్స్ బ్రాండ్లను తమ వ్యాపారంలో భాగంగా తిరిగి మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. 

నిత్యావసరాల తయారీ మార్కెట్లోకి..
ఎఫ్‌ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్) అంటే ఒక రకంగా చెప్పాలంటే.. మనం రోజూ తప్పనిసరిగా ఉపయోగించే నిత్యావసరాలే. టూత్ పేస్టుల దగ్గరి నుంచి సబ్బులు, కూల్ డ్రింక్స్ దాకా అన్నీ ఎఫ్ఎంసీజీ వస్తువుల కిందికి వస్తాయి. రిలయన్స్ సంస్థ ఇప్పటివరకు ఇతర సంస్థల నుంచి సామగ్రిని కొని తమ సూపర్ మార్కెట్లలో విక్రయిస్తోంది. ఇక ముందు స్వయంగా నిత్యావసరాలను తయారు చేయనుంది. ఎఫ్ఎంసీజీ రంగంలో ప్రస్తుతం హిందుస్థాన్‌ యూనిలీవర్‌, నెస్లే, బ్రిటానియా కంపెనీలు అగ్రగామిగా ఉన్నాయి. ఇప్పుడీ రంగంలోకి రిలయన్స్ దిగుతుండటంపై ఆసక్తి నెలకొంది.

దీపావళి నాటికి మార్కెట్లోకి..
  • రిలయన్స్ తమ తరఫున ఈ ఏడాది దీపావళి నాటికి కాంపా బ్రాండ్‌ కూల్ డ్రింక్స్ ను రీలాంచ్‌ చేయాలని భావిస్తున్నట్లు ఆ సంస్థ వర్గాలు వెల్లడించాయి. రిలయన్స్‌ రిటైల్‌ స్టోర్లు, జియో మార్ట్‌ తోపాటు బయటి కిరాణా దుకాణాల్లోనూ వీటిని విక్రయానికి పెట్టనున్నట్టు తెలిపాయి.
  • నిజానికి కంపా బ్రాండ్ దాదాపు 30 ఏళ్ల కింద బాగా ఆదరణ పొందింది. అప్పట్లో పార్లే సంస్థ ఆధ్వర్యంలోని థమ్స్‌ అప్‌, గోల్డ్‌ స్పాట్‌, లిమ్కాలతో కంపా కూల్ డ్రింక్ లు మార్కెట్లో పోటీ పడేవి. 
  • కోకాకోలా పార్లే బ్రాండ్లను కొనుగోలు చేయడం, విపరీతమైన దూకుడుతో మార్కెటింగ్ చేసుకోవడంతో కంపా కూల్ డ్రింక్స్ వెనుకబడిపోయాయి.
  • మధ్యలో మార్కెట్లోకి తిరిగి వచ్చేందుకు ప్రయత్నాలు జరిగాయి. తాజాగా రిలయన్స్ ద్వారా ఈ బ్రాండ్లు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నాయి.

  • Loading...

More Telugu News