Venkaiah Naidu: లండ‌న్‌లో కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి వినాయ‌క చ‌వితి వేడుక‌ల్లో వెంక‌య్య‌... ఫొటోలు ఇవిగో

venkaiah naidu participates vinayaka chavithi in laondon
  • లండ‌న్ టూర్ వెళ్లిన వెంక‌య్య‌
  • అక్క‌డే వినాయ‌క చ‌వితి వేడుక‌ల్లో పాలుపంచుకున్న వైనం
  • ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన మాజీ ఉప‌రాష్ట్రప‌తి
భార‌త మాజీ ఉప‌రాష్ట్రప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు ప్ర‌స్తుతం లండ‌న్ టూర్‌లో ఉన్నారు. స‌తీస‌మేతంగా లండ‌న్ వెళ్లిన వెంక‌య్యనాయుడు అక్క‌డ త‌న కుటుంబ స‌భ్యుల‌తో గ‌డుపుతున్నారు. ఈ క్ర‌మంలో బుధ‌వారం వినాయ‌క చ‌వితిని పుర‌స్క‌రించుకుని...లండ‌న్‌లోనే ఆయ‌న త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి వినాయ‌క చ‌వితి వేడుక‌ల్లో పాలుపంచుకున్నారు.

లండన్ లో కుటుంబ సభ్యులతో కలిసి వినాయక చవితి వ్రతాన్ని ఆచరించడం ఆనందాన్ని అందించిందని ఈ సంద‌ర్భంగా ఆయ‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ పోస్ట్‌ను పెట్టారు. ప్రజలందరికీ తమతమ రంగాల్లో విజయాలను అందించాలని అంబాసుతుణ్ని ప్రార్థించానంటూ ఆయ‌న పేర్కొన్నారు. చ‌వితి వేడుక‌ల్లో పాలుపంచుకున్న త‌న ఫొటోల‌ను ఆయ‌న సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు.
Venkaiah Naidu
Ex Vice Preisdent
London
Vinayaka Chavithi
Social Media

More Telugu News