Ganesh Chaturthi: భక్తులకు నేటి నుంచే ఖైరతాబాద్ పంచముఖి లక్ష్మీగణపతి దర్శనం

Khairatabad Ganesh visits starting from today
  • మరికాసేపట్లో స్వామివారిని దర్శించి పూజలు చేయనున్న గవర్నర్ తమిళిసై
  • 50 అడుగుల జంధ్యం, కండువా, పట్టువస్త్రాలను సమర్పించిన పద్మశాలి సంఘం
  • భక్తుల కోసం ప్రత్యేకంగా విగ్రహ సమీపంలో పాదాల ఏర్పాటు
ఖైరతాబాద్ ‘బడా గణేశ్’ను దర్శించుకోవాలనుకునే భక్తులకు ఇది శుభవార్తే. గణనాథుడిని దర్శించుకునేందుకు నేటి నుంచే భక్తులను అనుమతించనున్నారు. ఈ మేరకు నిర్వాహకులు ప్రకటించారు. ఖైరతాబాద్ గణేశుడు ఈసారి ‘పంచముఖ లక్ష్మీగణపతి’గా దర్శనం ఇవ్వనున్నాడు.

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరికాసేపట్లో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అంతకుముందు ఈ ఉదయం పద్మశాలి సంఘం తరపున 50 అడుగుల జంధ్యం, కండువా, గరికమాల, పట్టువస్త్రాలను స్వామి వారికి సమర్పించారు. కాగా, భక్తుల సౌకర్యార్థం ఈసారి స్వామివారి ప్రత్యేక పాదాలను ప్రధాన విగ్రహం సమీపంలో ఏర్పాటు చేశారు.
Ganesh Chaturthi
Hyderabad
Khairatabad Ganesh

More Telugu News