Ganesh: తగ్గేదేలే.. పుష్ప గణేశ్, ఆర్ఆర్ఆర్ గణేశ్.. వినాయక నవరాత్రుల్లో టాలీవుడ్ హవా!

pushpa RRR inspires ganpati idols

  • దేశవ్యాప్తంగా పలు చోట్ల భిన్నమైన పోజుల్లో వినాయక విగ్రహాలు
  • సినిమాల్లో అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్రలను పోలినట్టుగా రూపకల్పన
  • నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్న గణేశ్ విగ్రహాలు

ఈ ఏడాది టాలీవుడ్ సినిమాలు బాలీవుడ్ సహా దేశవ్యాప్తంగా ఊపు ఊపినట్టే.. ఆ సినిమాల్లోని పాత్రలు కూడా గణేశ్ నవరాత్రుల సందర్భంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఇటీవల దేశవ్యాప్తంగా రికార్డులతో దుమ్ము రేపిన పుష్ప, ఆర్ఆర్ఆర్ సినిమాల్లోని హీరో పాత్రలతో వినాయక విగ్రహాలు రూపొందాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా పలుచోట్ల అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ల పాత్రలకు సంబంధించిన పోజులతో వినాయక విగ్రహాలను సిద్ధం చేశారు. వీటికి సంబంధించిన ఫొటోలను ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా సైట్లలో పెట్టడంతో విపరీతంగా వైరల్ గా మారాయి.

 అల్లూరి, భీం, పుష్పరాజ్ ల హవా..
  • పుష్ప సినిమాలో పుష్పరాజ్ పాత్ర పోషించిన అల్లు అర్జున్ డైలాగ్ ‘తగ్గేదేలే..’. పలు చోట్ల ఇదే పుష్పరాజ్ పాత్ర ఆహార్యంలో.. అదే జుట్టు, వస్త్రాలు, ఇతర లక్షణాలతో.. తగ్గేదేలే అంటూ గడ్డంపై చేయి పెట్టినట్టుగా ఉన్న గణేశ ప్రతిమ అందరినీ ఆకట్టుకుంటోంది.
  • ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ పోషించిన అల్లూరి సీతారామరాజు పాత్రకు సంబంధించి వివిధ రూపాల్లోని గణేశ విగ్రహాలు అలరిస్తున్నాయి. సినిమా క్లైమాక్స్ లో రామ్ చరణ్ పరుగెడుతూ ఉన్నప్పటి తరహాలో, బాణాన్ని ఎక్కుపెడుతున్న తరహాలో రూపొందించిన గణేశ్ విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి.


Ganesh
Pushpa
RRR
Ramcharan
Junior NTR
Allu Arjun
movie news
  • Loading...

More Telugu News