Jayalalithaa: జయలలిత మృతి కేసు: శశికళ సహా పలువురిపై విచారణ!
- జయ మృతిపై ఇటీవల నివేదిక సమర్పించిన అర్ముగస్వామి కమిషన్
- శశికళ, శివకుమార్, అప్పటి ఆరోగ్యమంత్రి తదితరులపై ప్రభుత్వ విచారణకు ఆదేశించాలని ప్రతిపాదన
- నిన్న సాయంత్రం సమావేశమైన మంత్రివర్గం
- న్యాయనిపుణులతో చర్చించాలని నిర్ణయం
జయలలిత మృతి కేసుకు సంబంధించి శశికళ సహా పలువురిని విచారించాలని తమిళనాడు ప్రభుత్వం యోచిస్తోంది. జయ మృతిపై విచారణ జరిపిన జస్టిస్ అర్ముగస్వామి కమిషన్ ఇటీవల ముఖ్యమంత్రి స్టాలిన్‌కు నివేదిక అందించింది. జయలలిత నెచ్చెలి శశికళ, శివకుమార్, అప్పటి ఆరోగ్యమంత్రి విజయభాస్కర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామమోహన్‌రావు తదితరులను ప్రభుత్వ విచారణకు ఆదేశించాలని కమిషన్ సిఫార్సు చేసింది.
ఈ నేపథ్యంలో దీనిపై నిర్ణయం తీసుకునేందుకు సీఎం స్టాలిన్ నేతృత్వంలో మంత్రివర్గం నిన్న సాయంత్రం సమావేశమైంది. కమిషన్ సిఫార్సులపై తొలుత న్యాయ నిపుణులతో చర్చించాకే ముందుకు వెళ్లాలని మంత్రివర్గం నిర్ణయించింది.