Vishal: 'మార్క్ ఆంటోని'గా విశాల్ .. పోస్టర్ రిలీజ్!

Mark Antony movie poster released

  • 'మార్క్ ఆంటోని'గా విశాల్ 
  • ఆయన జోడీగా రీతూ వర్మ
  • ప్రతినాయకుడిగా ఎస్.జె.సూర్య
  • త్వరలో  తెలుగు .. తమిళ భాషల్లో రిలీజ్

తమిళనాట మంచి మాస్ ఇమేజ్ ఉన్న హీరోల్లో విశాల్ ఒకరు. తెలుగులోనూ ఆయనకి అదే స్థాయిలో ఫాలోయింగ్ ఉంది. ఆయన యాక్షన్ సినిమాలను ఇక్కడి ప్రేక్షకులు బాగానే చూస్తారు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'లాఠీ' సిద్ధమవుతోంది. ఆ తరువాత సినిమాగా 'మార్క్ ఆంటోని' రెడీ అవుతోంది.

వినోద్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాకి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ రోజున విశాల్ బర్త్ డే కావడంతో, ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ఆయన స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పక్కా మాస్ లుక్ తో తుపాకీ గురిపెట్టిన విశాల్ ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాడు. పోస్టర్ అంతా కూడా తూకాలు .. తూటాలే కనిపిస్తున్నాయి. 

దీనిని బట్టి ఇది భారీ యాక్షన్ మూవీ అనే విషయం అర్థమవుతోంది. విశాల్ ఈ తరహా లుక్ తో కనిపించడం ఇదే ఫస్టు టైమ్ అని చెప్పుకోవచ్చు. రీతూ వర్మ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, ప్రతి నాయకుడిగా ఎస్. జె. సూర్య కనిపించనున్నాడు. సామ్ సీఎస్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులోను రిలీజ్ చేయనున్నారు.

Vishal
Ritu Varma
Mark Antony Movie
  • Loading...

More Telugu News