Raviteja: క్లైమాక్స్ వరకూ వెళ్లిపోయిన 'రావణాసుర'

Ravanasura Movie Update

  • 'రావణాసుర'గా రవితేజ 
  • ఆయన సరసన ఐదుగురు  హీరోయిన్లు 
  • సుధీర్ వర్మ నుంచి వస్తున్న యాక్షన్ థ్రిల్లర్  
  • సెప్టెంబర్ 30వ తేదీన విడుదల  

రవితేజ కథానాయకుడిగా 'రావణాసుర' సినిమా రూపొందుతోంది. అభిషేక్ పిక్చర్స్ వారు నిర్మించే ఈ సినిమాకి, రవితేజ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. ప్రస్తుతం క్లైమాక్స్ దృశ్యాలను చిత్రీకరిస్తున్నట్టుగా సమాచారం. 

'రావణాసుర' టైటిల్ ను సెట్ చేసిన దగ్గర నుంచి ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూ పోతున్నాయి. ఈ సినిమాలో రవితేజ పాత్ర, ఇంతవరకూ ఆయన చేసిన పాత్రలకు భిన్నంగా ఉంటుందని అంటున్నారు. సుశాంత్ కీలకమైన పాత్రను పోషిస్తున్న ఈ సినిమాకి హర్షవర్ధన్ రామేశ్వర్ - బీమ్స్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. 

రవితేజ సరసన నాయికలుగా అనూ ఇమ్మాన్యుయేల్ .. మేఘ ఆకాశ్ .. ఫరియా అబ్దుల్లా .. పూజిత పొన్నాడ .. దక్ష నగార్కర్ అలరించనున్నారు. ఈ ఏడాది ఇంతవరకూ రవితేజ నుంచి వచ్చిన రెండు సినిమాలూ ఫ్లాప్ అయ్యాయి. సెప్టెంబర్ 30వ తేదీన రానున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందనేది చూడాలి.

More Telugu News