Passport: ఇకపై శనివారం కూడా తెరుచుకోనున్న తెలంగాణలోని పాస్‌పోర్టు కేంద్రాలు

Passport Offices in telangana opens on saturday from set 3rd

  • దరఖాస్తుల పరిశీలనకే మూడువారాల సమయం పడుతోందన్న అధికారులు
  • ఇకపై మరింత వేగంగా పాస్‌పోర్టు పొందే అవకాశం
  •  హైదరాబాద్ సహా నిజామాబాద్, కరీంనగర్ కార్యాలయాలు కూడా శనివారం సేవలు
  • సెప్టెంబరు 3 నుంచి అమల్లోకి

హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయ పరిధిలోని అన్ని కార్యాలయాలు ఇకపై శనివారం కూడా సేవలు అందించనున్నాయి. పాస్‌పోర్టు కార్యాలయాలు ప్రస్తుతం ఐదు రోజులు మాత్రమే పనిచేస్తున్నాయి. ఇకపై శనివారం కూడా సేవలు పొందొచ్చని హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య తెలిపారు. విదేశాలకు వెళ్లేందుకు పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారు వారాల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. దరఖాస్తుల పరిశీలనకే మూడు వారాల సమయం పడుతోంది. 

ఈ నేపథ్యంలో ఇటీవల ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాన్ని సందర్శించిన వీసా, పాస్‌పోర్టు విదేశీ మంత్రిత్వశాఖ కార్యదర్శి ఎ.సయీద్ దృష్టికి అధికారులు ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఆయన సానుకూలంగా స్పందించి శనివారం కూడా ఆయా కేంద్రాలు కార్యకలాపాలు కొనసాగించాలని ఆదేశించారు. సెప్టెంబరు 3 నుంచి హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం పరిధిలోని టోలీచౌకి, బేగంపేట, అమీర్‌పేట, నిజామాబాద్, కరీంనగర్ పాస్‌పోర్టు కేంద్రాలు ప్రతి శనివారం తెరుచుకుంటాయని బాలయ్య తెలిపారు.

  • Loading...

More Telugu News